
తాజా వార్తలు
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని వివరించిన నిపుణులు
తంపా: అమెరికాలోని తంపాలో ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) ఆధ్వర్యంలో ‘యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. స్థానికంగా ఉండే తెలుగు కుటుంబాలకు చెందిన యువతీయువకులు ఈ సెమినార్‌కు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం యువతపై ఏ విధంగా ఉంటుందనే విషయాలపై కూలంకషంగా ఆ రంగ నిపుణులు మార్టిన్ స్పెన్సర్ యువతకు వివరించారు. యువత సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలనే దానిపై వారికి పలు సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా కొత్తగా కళాశాలల్లో చేరబోయే విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రజితా నిడదవోలు వివరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాల విద్యపై వారికున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. నాట్స్ తంపాబే సమన్వయకర్త రాజేశ్ కందురు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఎన్నో కొత్త విషయాలకు తెలుసుకున్నామని.. ఈ సందర్భంగా వారు నాట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
