close

తాజా వార్తలు

వర్మ సినిమా.. లిఫ్ట్‌ అంటే భయం పుట్టించింది!

అజయ్‌ దేవగణ్‌

ముంబయి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘భూత్‌’. ఊర్మిళ, రేఖ, నానా పటేకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2003లో హిందీలో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. తర్వాత ఇదే సినిమాను తెలుగులో ‘12వ అంతస్తు’ టైటిల్‌తో డబ్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ సంఘటనను అజయ్‌ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో లిఫ్ట్‌ అంటే తనకు భయం పుట్టిందని అన్నారు.

‘‘భూత్‌’ సినిమా షూటింగ్‌ 28వ అంతస్తులో జరుగుతోంది. ఓ రోజు నేను షూట్‌కు బయలుదేరా. 28వ అంతస్తుకు వెళ్లడానికి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లిఫ్ట్‌ ఎక్కా. అది నాలుగో అంతస్తు దగ్గర ఆగిపోయింది. దాదాపు ఒకటిన్నరగంటపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయా. ఆ తర్వాతి నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్లేవాడ్ని. ఈ సంఘటన లిఫ్ట్‌ అంటే నాలో భయం పుట్టించింది. 28వ అంతస్తు అయినా సరే.. నెల రోజులపాటు రోజుకు నాలుగు సార్లు మెట్లపైనే వెళ్లి, వచ్చేవాడ్ని’ అని అజయ్‌ చెప్పారు.


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.