
తాజా వార్తలు
చెన్నై: ‘గజిని’ చిత్రంలో తాను అనవసరంగా నటించానని బాధపడుతున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార. ఓ ప్రముఖ తమిళనాడు మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2005లో వచ్చిన ‘గజిని’ సినిమాలో నయన్ చిత్ర అనే వైద్యురాలి పాత్రలో నటించారు. అయితే దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ తనకు చిత్ర పాత్ర గురించి ఒకలా వివరించి, తెరకెక్కించేటప్పుడు మాత్రం మార్చేశారని నయన్ అన్నారు.
తన కెరీర్లో ‘గజిని’ సినిమాను ఎంచుకోవడమే తాను చేసిన తప్పని పేర్కొన్నారు. అయితే ఆ అనుభవం మల్టీస్టారర్ సినిమాలు ఎంచుకునేముందు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని నేర్పిందని తెలిపారు.
‘గజిని’ సినిమాలో సూర్య, అసిన్ జంటగా నటించారు. ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత సినిమాను హిందీలో ఇదే టైటిల్‌తో రీమేక్ చేశారు. హిందీ రీమేక్‌లో ఆమిర్ ఖాన్, అసిన్ జంటగా నటించారు. ప్రస్తుతం నయన్ ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- విచారణ ‘దిశ’గా...
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
