close

తాజా వార్తలు

‘తను మనల్ని చంపేస్తుంది’

‘x మెన్‌: డార్క్‌ ఫినిక్స్‌’ తెలుగు ట్రైలర్‌ విడుదల

లాస్‌ఏంజెల్స్‌: ‘x మెన్‌’ సిరీస్‌ నుంచి మరో సూపర్‌ హీరో చిత్రం రాబోతోంది. దీనికి ‘డార్క్‌ ఫినిక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సిమోన్‌ కిన్‌బర్గ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘x మెన్‌ అపోకలిప్స్‌’కు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఇందులో ప్రముఖ హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌ ఫినిక్స్‌ పాత్రలో నటించారు. సినిమాలో ఆమె పాత్రకు టెలీకైనెటిక్‌ శక్తులు ఉంటాయి. అంటే ఓ మనిషిని ముట్టుకోకుండానే వారిని ఏదైనా చేయొచ్చు. ఈ చిత్రం కోసం సోఫీ డిసోసియేటివ్‌ ఐడెంటిటీ డిజార్డర్‌, షీజోఫ్రెనియా గురించి పరిశోధన చేశారట. ‘x మెన్‌’ సిరీస్‌లో ఓ నటికి ఇంతటి కీలక పాత్ర దక్కడం ఇదే మొదటిసారని దర్శకుడు కిన్‌బర్గ్‌ తెలిపారు. జూన్‌ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.