close

తాజా వార్తలు

జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు: వర్మ

హైదరాబాద్‌: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న  వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో  ఘోర ఓటమి దిశగా పయనిస్తున్న తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ అసెంబ్లీ ఫలితాలపై సర్వేను వెల్లడించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై వర్మ తనదైన స్టైల్‌లో ఫన్నీ కామెంట్‌ చేశారు. ఆయన్ను కొందరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్తున్న ఫొటోను షేర్‌ చేశారు. దానిపై ‘ఇంకెప్పుడూ సర్వేలు చేయను, వదిలేయండి’ అని లగడపాటి అంటున్నట్లు రాసుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’ సినిమాల ఫలితాలకు సమానంగానే ఎన్నికల ఫలితాలు కూడా ఉన్నాయని ఓ ఫొటోను పోస్టు చేశారు.

ఇది ఏపీ ప్రజల విజయం..

వైఎస్‌ జగన్‌కు సినీ నటుడు మంచు విష్ణు శుభాకాంక్షలు చెప్పారు. ఇది ఏపీ ప్రజల విజయమని పేర్కొన్నారు. ‘శుభాకాంక్షలు వైఎస్‌ జగన్‌ అన్న. ఇది ప్రజల కోసం ఏర్పడబోతున్న ప్రభుత్వం. ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వ పాలన మొదలైంది’ అని విష్ణు ట్వీట్‌ చేశారు.
శుభాకాంక్షలు జగన్‌ అన్న
‘పవర్‌ఫుల్‌గా గెలుపొందిన జగన్‌ అన్నకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌ రైతులు, విద్యార్థుల సంక్షేమం కోసం వైకాపా పార్టీ కృషి చేస్తుందని ఆశిస్తున్నా. మీ పాలనలో మన రాష్ట్ర అభివృద్ధిని చూసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మంచు మనోజ్‌ పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.