close

తాజా వార్తలు

‘టెర్మినేటర్‌: ది డార్క్‌ ఫేట్‌’ ట్రైలర్‌ విడుదల

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌ విజయం అందుకున్న ‘టెర్మినేటర్‌’ ఫ్రైంచైజ్‌ నుంచి వస్తున్న ఆరో చిత్రం ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్’. టిమ్‌ మిల్లర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. టెర్మినేటర్‌ను పోలి ఉన్న రెవ్‌-9 (గేబ్రియల్‌ లూనా) డ్యానీ (నటాలియా రెయేస్‌)ను చంపాలని యత్నిస్తుంటాడు. డ్యానీని కాపాడేందుకు సారా కోన్నర్‌ (లిండా హ్యామిల్టన్‌), అసలైన టెర్మినేటర్‌ (ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌)తో కలిసి సాయశక్తులా ప్రయత్నిస్తుంది. రెవ్‌-9 నుంచి సారా.. డ్యానీని ఎలా కాపాడింది? అన్నదే ఈ సినిమా కథ. పారామౌంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై జేమ్స్ కెమరూన్‌, డేవిడ్‌ ఎల్లిసన్‌ సంయుక్తంగా నిర్మింస్తు్న్నారు. నవంబర్‌ 1న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.