close

తాజా వార్తలు

కౌసల్య కృష్ణమూర్తి రక్తంలోనే క్రికెట్‌ ఉంది!

హైదరాబాద్‌: నటి ఐశ్వర్య రాజేష్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. ‘ది క్రికెటర్‌’ అనేది ఉపశీర్షిక. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను కె.ఎస్‌. రామారావు సమర్పిస్తున్నారు. ధిబు నైనన్‌ థామస్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. దీన్ని ఐశ్వర్య రాజేష్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఓ పల్లెటూరికి చెందిన అమ్మాయి క్రికెటర్‌ అయ్యేందుకుపడ్డ శ్రమ చుట్టూ ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ‘రక్తంలోనే క్రికెట్‌ ఉంది’ అంటూ పోస్టర్‌పై పేర్కొన్నారు.

ఈ చిత్రంలో ఐశ్వర్య తండ్రిగా రాజేంద్ర ప్రసాద్‌ నటిస్తున్నారు. తమిళ హీరో శివ కార్తికేయన్‌ అతిథి పాత్రలో నటించారు. కార్తిక్‌ రాజు, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.