
తాజా వార్తలు
‘ఎన్జీకే’ ప్రచారంలో సూర్య
హైదరాబాద్: కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్న కథానాయకుడు సూర్య. ఆయన నటించిన సినిమాలు దాదాపు తెలుగులోనూ విడుదల అవుతాయి. సూర్య కొత్త సినిమా ‘ఎన్జీకే’ మే 31న విడుదల కాబోతోంది. సెల్వరాఘవన్ దర్శకుడు. సాయి పల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా సూర్య హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తన సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఆయన ‘షాట్ ఓకే’ చెప్పడం చాలా కష్టం
‘దర్శకుడు సెల్వరాఘవన్ అంటేనే.. ఓ విచిత్రమైన స్కూలుతో సమానం. మనం ఏం నేర్చుకున్నా అవన్నీ మర్చిపోయి ఆయన సెట్‌కి వెళ్లాలి. ఆయన ఓ సన్నివేశాన్ని తెరకెక్కించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. నలుగురైదుగురు రచయితల్ని పక్కన పెట్టుకుని సన్నివేశాలు రాసుకోరు. ఆయన ఒక్కరే కూర్చుని కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ రాసుకొస్తారు. ఓ సన్నివేశాన్ని ఎలా మొదలెట్టాలి?ఎలా ముగించాలి?అనే విషయంలో ఆయనకంటూ ఓ శైలి ఉంది. ఆయన ‘షాట్ ఓకే’ అనడం చాలా కష్టం. ఒక్కోసారి 70, 80 టేకులు అయిపోయినా.. ఆయన అలసిపోరు. ఒక్కోరోజు ఏమీ చేయకుండానే షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాల్సి వస్తుంది. నా కోపం, ఆవేశం, నవ్వు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. కానీ.. అవన్నీ ‘ఎన్జీకే’లో కనిపించవు. ఓ కొత్త సూర్యని చూస్తారు’.
ఆయన సినిమాలు ప్రత్యేకం
‘సెల్వ రాఘవన్‌కు చాలా ఏళ్లుగా విజయాలు లేవు. అంతలో మాత్రానా ఆయనకు నైపుణ్యం లేనట్లు కాదు. ధోనీ కూడా అప్పుడప్పుడూ ఫామ్ కోల్పోతుంటాడు. తను మంచి బ్యాట్స్‌మెన్ కాకుండా పోతాడా? కొంతమంది దర్శకులు కూడా అంతే. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ‘ఇది ఫలానా దర్శకుడు తీసిన సినిమాలా ఉంది’ అనుకుంటుంటాం. కానీ సెల్వరాఘవన్ చిత్రాలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. తనని ఎవరితోనూ పోల్చలేం’.
నేను రచయితని కాదు
‘నా దగ్గరకు వచ్చే కథల్ని బట్టే ఎంపిక ఉంటుంది. నా కథ నేనే రాసుకోవడానికి నేను రచయితని కాదు. కాకపోతే.. ‘యువ’ తరవాత చిత్రసీమలో రాజకీయ నేపథ్యంలో కథలు చాలా వచ్చాయి. వాటితో పోలిస్తే ‘ఎన్జీకే’ కొత్తగా ఉంటుంది’.
ఇది బయోపిక్ కాదు
‘‘ఎన్జీకే’ బయోపిక్ కాదు. సమాజంలో జరిగే విషయాలే తెరపై ఉంటాయి. ఓ పార్టీనో, నాయకుడినో, ప్రాంతాన్నో అన్వయించుకునే కథ కాదు. అందరి కథలా అనిపిస్తుంది. అలాగని ఇదేదో రాజకీయాలపై వ్యంగాస్త్రం అనుకోవద్దు’.
త్రివిక్రమ్‌తో చర్చలు జరుగుతున్నాయి
‘నేను, త్రివిక్రమ్‌తో చాలాసార్లు ఓ ప్రాజెక్టు విషయమై మాట్లాడుకున్నాం. ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగులో సినిమా చేయడానికి నేనూ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నా’.
* మీ స్నేహితుడు జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఓ స్నేహితుడిగా మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. ‘చాలా సంతోషంగా ఉంది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. తను ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి. ప్రస్తుతం ఆయనపై హిమాలయాలంత బరువు ఉంది. ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటారని ఆశిస్తున్నా’ అని సూర్య చెప్పారు.
* ‘యాత్ర 2’లో మీరు నటిస్తారని వార్తలొచ్చాయి అని అడగగా.. ‘ఆ కథ నా వరకూ వచ్చి, స్క్రిప్టు నచ్చితే తప్పకుండా చేస్తా’ అని ఆయన పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
