close

తాజా వార్తలు

రాజశేఖర్‌ కుమార్తె ‘దొరసాని’ వచ్చేసింది!

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దొరసాని’. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. లుక్‌లో శివాత్మిక కారులో ప్రయాణిస్తుండగా.. సైకిల్‌పై ఆనంద్‌ ఆమెను ఫాలో అవుతూ కనిపించారు. లుక్‌ను చూస్తే సినిమాను 1980ల కాలం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రముఖ షార్ట్‌ ఫలింమేకర్‌ కేవీఆర్‌ మహేంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

జూన్‌7న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు లుక్‌లో ప్రకటించారు. మహేంద్ర ఇండస్ట్రీలో 17 ఏళ్లుగా ఉన్నప్పటికీ ‘దొరసారి’ స్క్రిప్ట్‌ను తయారుచేయడానికి తనకు ఐదేళ్ల సమయం పట్టిందట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పాతకాలంనాటి టీనేజ్‌ రొమాన్స్‌ను, ఆ కాలంలో ఇద్దరు ప్రేమికులు సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. యశ్‌ రంగినేని, మధురా శ్రీధర్‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.