close

తాజా వార్తలు

మహేశ్‌.. పుట్టుకతోనే సూపర్‌స్టార్‌: వర్మ

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు పుట్టుకతోనే సూపర్‌స్టార్‌ అని ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. మహేశ్‌ బాలనటుడిగా చేసిన ఓ సినిమాలోని సన్నివేశం వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో మహేశ్‌ నటనను మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. ‘యాటిట్యూడ్‌తో క్యూట్‌నెస్‌ మిక్స్‌ అయిపోయింది. వాటితో ఆత్మస్థైర్యం కలిసింది. మహేశ్‌ బాబు నిజంగా పుట్టుకతోనే సూపర్‌స్టార్‌’ అని వర్మ పేర్కొన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల విశేష స్పందన వస్తోంది. ‘మహేశ్‌తో ఓ సినిమా తీయండి’ అని కామెంట్లు చేశారు. వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. అనేక వివాదాలు ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పటికే తెలంగాణలో విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్రాన్ని విడుదల చేశారు. రాకేష్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.