close

తాజా వార్తలు

మళ్లీ రవితేజకు జోడీగా?

రవితేజ - శ్రుతిహాసన్‌ జోడీ ‘బలుపు’ చిత్రంతో ఆకట్టుకుంది. రవితేజ శైలి మాస్‌ అంశాలకి శ్రుతిహాసన్‌ అందచందాలు తోడవ్వడంతో ఆ చిత్రం ప్రేక్షకులకి వినోదం పంచింది. విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు ఇద్దరూ. ఆ కలయికలో మరో చిత్రం రూపొందనున్నట్టు సమాచారం. ‘బలుపు’ను తెరకెక్కించిన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రవితేజ ఇటీవలే అంగీకారం తెలిపారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఆ సినిమాలో నాయికగా శ్రుతిని ఎంపిక చేసుకొనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ‘కాటమరాయుడు’ తర్వాత శ్రుతి తెలుగులో సినిమా చేయలేదు. కొన్నాళ్లుగా సంగీతంపైనే దృష్టి పెట్టిన ఆమె ఇటీవలే తమిళంలో ఓ చిత్రం కోసం రంగంలోకి దిగింది. తెలుగులోనూ సినిమాలు చేయడానికి ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రంతో బిజీగా గడుపుతున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.