close

తాజా వార్తలు

ముట్టుకుంటే రహస్యాలు తెలిసిపోతాయ్‌!

ఉత్కంఠభరితంగా ‘స్పెషల్‌’ ట్రైలర్

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు అజయ్‌ పోలీసు అధికారిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్పెషల్‌’. వాస్తవ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ‘ఇదో మైండ్‌ రీడర్‌ స్టోరీ. ఇంతకుముందు ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ ఊహించని ఓ కొత్త స్టోరీ. టచ్‌ చేయడం ద్వారా ఎదుటి వాళ్ల మనసుల్లో దాగి ఉన్న రహస్యాలను చదవగలిగే పారాసైకాలజిస్ట్‌ స్టోరీ’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. రంగా, అక్షత కీలక పాత్రలు పోషించారు. సినిమాలో రంగా ఓ పారా సైకాలజిస్ట్‌. ఇతన్ని అక్షత ప్రేమలో పడేయాలని చూస్తుంది. ఆమెను ముట్టుకున్నప్పుడు ఆమెలోని రహస్యాలన్నీ అతనికి తెలిసిపోతాయి. ఆ తర్వాత దారుణంగా హత్యలకు ఒడిగడుతుంటాడు. ఈ హత్యలను ఛేదించే పోలీసు అధికారిగా అజయ్‌ నటించారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.