close

తాజా వార్తలు

‘రోబో’ తొలి హీరో కమల్‌హాసన్‌ను చూశారా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘రోబో’. చిట్టి రోబోగా రజనీ నటన ప్రేక్షకులను కట్టి పడేసింది. 2010లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అయితే, తొలుత ఇందులో కథానాయకుడిగా కమల్‌హాసన్‌ను అనుకున్నారు. కథానాయికగా ప్రీతి జింతాను కూడా తీసుకున్నారు. 1998లోనే ఇందుకు సంబంధించిన ఫొటో షూట్‌ చేశారు. అయితే, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు రద్దయింది. శంకర్‌కు ఉన్న విజన్‌ ప్రకారం అప్పటికి ఆ స్థాయి టెక్నాలజీ అందుబాటులో లేదు. పైగా కమల్‌హాసన్‌ కూడా వేరే చిత్రాల్లో బిజీగా ఉండటంతో సినిమాకు ముందుకు సాగలేదు.

ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ శంకర్‌ ‘రోబో’ను తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆమీర్‌ఖాన్‌ను కలవగా అప్పటికే ఒప్పుకొన్న చిత్రాల కారణంగా ఆయన ఈ సినిమా చేసేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత బాల్‌ షారుఖ్‌ కోర్టులోకి వెళ్లింది. కథానాయికగా ప్రియాంక చోప్రాను కూడా అనుకున్నారు. అయితే, శంకర్‌ సినిమా ఆలస్యమవుతుందన్న కారణంతో షారుఖ్‌ కూడా ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో శంకర్‌ రజనీకాంత్‌ను కలిశారు. ఆయనకూ కథ నచ్చడంతో ‘రోబో’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.