
తాజా వార్తలు
‘హిప్పీ’ దర్శకుడు టీఎన్ కృష్ణ
హైదరాబాద్: ‘హిప్పీ’ లాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకూ సినిమా రాలేదని అంటున్నారు దర్శకుడు టీఎన్ కృష్ణ. ఆయన తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తికేయ కథానాయకుడిగా నటించారు. దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ కథానాయికలు. గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టీఎన్ కృఫ్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి మాట్లాడుతూ..
‘నేను తమిళంలో తెరకెక్కించిన ‘సిల్లును ఒరు కాదల్’ సినిమా తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా విడుదలైంది. తెలుగులో నా తొలి సినిమా ‘హిప్పీ’. మనసుకు ఏది తోస్తే దానిని చేసుకుంటూ పోయే ఓ కుర్రాడి కథ ఇది. సినిమా చాలా బాగుంటుంది. నిర్మాత కూడా సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం సమాజంలో యువత ఎలా ఉంది అన్న కోణాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఇందులో ఓ సందేశం కూడా ఉంటుంది. జాన్ మెల్టన్ రాసిన ‘ప్యారడైజ్ లాస్ట్’ అనే నవల నుంచి స్ఫూర్తిపొంది ఈ సినిమాను తీశాను. పోస్టర్లలో లిప్ లాక్ సన్నివేశాలున్నప్పటికీ సందేశాత్మకంగా తెరకెక్కించాం. జేడీ చక్రవర్తి పాత్ర కూడా చాలా బాగుంటుంది. కేవలం ప్రేమే కాదు అన్ని అంశాలు ఉన్నాయి. ఎవ్వరూ ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాను తీయలేదు. ఈ సినిమాను కార్తికేయ చేస్తేనే బాగుంటుంది అనిపించింది’ అని తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
