close

తాజా వార్తలు

‘సింహాసనం ఎక్కాల్సిన సమయమొచ్చింది’

‘ది లయన్‌ కింగ్‌’ కొత్త ప్రోమో చూశారా..

లాస్‌ఏంజెల్స్‌: డిస్నీ సంస్థ నిర్మించిన ‘ది లయన్‌ కింగ్’ కొత్త ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ప్రముఖ పాప్‌ గాయని బియాన్సే.. ఆడ సింహమైన నాలాకు గాత్రం అందించారు. ‘సింబా.. సింహాసనం ఎక్కాల్సిన సమయం వచ్చింది’ అని నాలా.. సింబాతో చెబుతున్న డైలాగ్‌తో ప్రోమో మొదలైంది. జాన్‌ ఫావ్రో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆఫ్రికాలోని సవాన్నా అడవుల్లో సింబా (సింహం పిల్ల) పుడుతుంది. సింబాను అడవికి రాజును చేయాలని తండ్రి ముఫాసాతో పాటు ఇతర ప్రాణులు ఓ నిర్ణయానికి వస్తాయి. కానీ సింబా పుట్టుక అందరికీ రుచించదు. ముఫాసా సోదరుడు స్కార్‌ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్లు వేస్తుంటుంది. తనకు పరిచయమైన కొత్త ప్రాణులతో స్నేహం చేసి సింబా ఎలా గెలిచింది? అన్నదే సినిమా కథ.  త్రీడీ యానిమేటెడ్‌ సాంకేతికతతో తెరకెక్కించిన ఈ సినిమాను జులై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.