
తాజా వార్తలు
హైదరాబాద్: ‘ఆర్ఎక్స్ 100’తో సూపర్‌హిట్ అందుకున్న యువ కథానాయకుడు కార్తికేయ నటించిన సినిమా ‘హిప్పీ’. దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ కథానాయికలు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. టి.ఎన్.కృష్ణ దర్శకుడు. కలైపులి ఎస్.థాను నిర్మాత. జూన్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కార్తికేయ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి..
* ‘‘హిప్పీ’లో నేను నాలుగు రకాలుగా కనిపిస్తా. అలాగని పాత్రని విడదీసి చూడకూడదు. ఒక యువకుడి జీవిత ప్రయాణం అన్నమాట. కిక్ బాక్సర్, గిటారిస్ట్‌గానే కాకుండా... సాఫ్ట్వేర్ కుర్రాడిగా కూడా కనిపిస్తా. కొన్ని సన్నివేశాల్లో గుండుతో కనిపిస్తా. ఈ గెటప్పులతో పాటు, కనిపించనిది మరొకటి ఉంది. దాన్ని తెరపైనే చూడాలి.
* ‘ఇందులోని కీలక పాత్రకు జేడీ చక్రవర్తిని తీసుకుందాం అనుకున్నాం. దీంతో చాలా మంది, చాలా రకాలుగా భయపెట్టారు. ‘ఆయన్నెందుకు తీసుకుంటున్నారు. కోపం వస్తే సెట్ నుంచి వెళ్లిపోతాడు, కొడతాడు, తిడతాడు’ అని చెప్పారు. కానీ ఆయనతో కలిసి సెట్‌కి వెళ్లాక విన్నదొక్కటి వాస్తవం మరొకటి అనిపించింది. ‘మీ గురించి ఇలా అబద్ధం చెప్పారు సర్’ అన్నా. ‘అది నిజమే. నాకు ఏదైనా నచ్చకపోతే అలాగే చేస్తాను. కానీ నాకు నీతో పాటు... ఈ కథ, పాత్రలు బాగా నచ్చాయి. అందుకే ఇలా ఉన్నాను’ అని చెప్పారు.
* ‘‘ఆర్ఎక్స్ 100’ విడుదలకి ముందు నాపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఆ చిత్రం నన్ను మంచి స్థాయికి తీసుకెళ్లింది. అందుకే ఒత్తిడిగా ఉంది. అయితే ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నా. నన్ను ఒక కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ఈ వయసులో నా దగ్గరికి ప్రేమకథలే వస్తాయి. వాటిలో రొమాంటిక్ నేపథ్యం కచ్చితంగా ఉంటుంది. నేను వాస్తవికతతో కూడిన సహజమైన కథల్ని ఎంచుకొంటున్నా.
* ‘‘గుణ 369’ తర్వాత శేఖర్‌రెడ్డి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. ఆ తర్వాత శ్రీ సారిపల్లి అని మరో దర్శకుడితో సినిమా చేస్తా. మధ్యలో కొన్ని పెద్ద సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకున్నాను కానీ.. దర్శకులు మారడంతో వెనక్కి ఇచ్చేశా. మా సొంత సంస్థలో కూడా మరో సినిమా చేయాలనే ఆలోచన ఉంది’.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
