
తాజా వార్తలు
వ్యాయామాలు చేయడానికి జిమ్‌కి ఎంతో ఉత్సాహంగా వెళ్తాం కదూ... కానీ అక్కడ పాటించాల్సిన మర్యాదలు కూడా కొన్ని ఉంటాయని తెలుసా...
* జిమ్‌కి వెళ్లేటప్పుడు వెంట న్యాప్కిన్ తప్పనిసరిగా ఉండాలి. మీరు చెమటను తుడుచుకోవడమే కాదు... ఆ పరికరాలకు అంటుకున్న చెమటను కూడా తుడిచేయొచ్చు. దానివల్ల ఇతరులకు అసౌకర్యం ఉండదు.
* ఏదయినా పరికరం వాడుతున్నప్పుడు ఫోను చూడకపోవడమే మంచిది. ఇది ఇతరులకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మీరు వాటిని ఉపయోగిస్తున్నారని వారు భావించి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తారు.
* గట్టిగా ఫోను మాట్లాడటం, బయటకు వినిపించేలా పాటలు పెట్టుకోవడం కూడా సరికాదు. ఫోను వస్తే బయటకు వెళ్లడం మంచిది.
* ట్రెడ్మిల్, సైకిల్ లాంటివాటిని ఇతరులూ చేయాలనుకుంటారు కాబట్టి గంటల తరబడి వాడకూడదు. సూటిగా చెప్పాలంటే పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకూ వాడి వదిలేయాలి. అప్పుడే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
* బరువులను ఎత్తిన తరువాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయడం సరికాదు. మీరు వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడే ఉంచాలి.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
