
తాజా వార్తలు
హైదరాబాద్: ‘వీళ్లంతా ఎవరు’ అని శ్రద్ధాకపూర్ అడిగితే, ‘ఫ్యాన్స్.. డైహార్డ్ ఫ్యాన్స్’ అని ‘సాహో’ టీజర్లో చెప్పుకొచ్చాడు మన ‘డార్లింగ్’ ప్రభాస్. మరి ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఇంతేనేమో! టీజర్ విడుదలైన ఆరు గంటల్లోనే 25 మిలియన్ల డిజిటల్ వ్యూస్(అన్ని భాషల్లో) సంపాదించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ‘సాహో’ కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రద్ధాకపూర్ కథానాయిక. గురువారం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ‘సాహో’ టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. టీజర్‌ను చూసిన వారందరూ ‘అద్భుతం’ అంటూ మెచ్చుకుంటున్నారు. మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రంలో ‘డార్లింగ్’ ప్రభాస్ నటించారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తెగ పొగిడేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు మంత్ర ముగ్ధులైపోతున్నారు.
తెలుగులో ఇప్పటికే 5.1మిలియన్ వ్యూస్ దాటగా, తమిళ్ 3.5 మిలియన్లు, మలయాళం 4.25లక్షలు, ఇక హిందీ 6.2మిలియన్ల డిజిటల్ వ్యూస్ దాటి సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
