close

తాజా వార్తలు

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ: వీడియో షేర్‌ చేసిన శ్రద్ధ

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా టీజర్‌ దూసుకెళుతోంది. ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల మందికి పైగా టీజర్‌ను వీక్షించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో శ్రద్ధను సర్‌ప్రైజ్‌ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘సాహో’ టీజర్‌ను ప్రదర్శించారు. టీజర్‌ చూస్తూ అభిమానులు ఈలలు వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ రచ్చ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ప్రభాస్‌తో, సుజీత్‌తో కలిసి పనిచేయడం ఓ కలలా ఉంది. చిత్రబృందం పడిన రెండేళ్ల కష్టానికి ఈ రకమైన స్పందన చూసి చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అయితే శ్రద్ధ పోస్ట్‌ చేసిన వీడియో ఇక్కడి థియేటర్‌ లోనిదా? లేక ముంబయిలోని థియేటర్‌లో చిత్రించిందా అన్నది తెలియరాలేదు. ‘సాహో’ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.