
తాజా వార్తలు
* ఏంట్రా ఎప్పుడూ అదే స్టేటస్సా?.... మార్చవా?
* రోజుకో స్టేటస్ పెడతావ్! నువ్వు సూపర్రా బాబు!
* వీడైతే ఆల్బమ్‌లే పెట్టేస్తాడు స్టేటస్‌లో.. దేనికి కామెంట్ ఇవ్వాలో కూడా తెలియదు!
* ఇలా సరదా, స్టైల్ స్టేటస్‌ల గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం! కానీ, స్టేటస్‌లను వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకోవడానికే కాకుండా సమాజ హితానికి వాడేవారు ఉన్నారు తెలుసా? ప్రొఫైల్ పిక్‌లు, స్టేటస్ అప్డేట్లతో సమాజ చైతన్యమే వీరి అభిమతం!
వాట్సప్‌లోనే కాదు.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. యూజర్లు రోజుకో స్టేటస్, ప్రొఫైల్పిక్, అబౌట్లను ఉంచుతుంటారు. యువతరంలో వీటికి ఉన్న క్రేజీనే వేరు. తమ గొప్పతనాన్ని చూపేందుకు, తమ పట్ల ఇతరులు ఆకర్షితులవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభావంతమైన చిత్రాలు, సందేశాలు, దృశ్యాలను ఉంచుతుంటారు. దీనికి భిన్నంగా మిలీనియల్స్ కొందరు స్పందిస్తున్నారు. ఇతరులకు సాయం అందేలా స్టేటస్‌లను ఉపయోగించుకుంటున్నారు. సమాజ హితం కోరి ఏదైనా సందేశాన్ని ఇతరులకు వెంటనే చేర్చేందుకు వీటిని వేదికలుగా చేసుకుంటున్నారు. ఎక్కడో శ్రీకాకుళం.. మరెక్కడో ఆదిలాబాద్.. అవసరం ఎవరిదైనా.. సమస్య ఏదైనా.. సోషల్ మీడియా సాక్షిగా ప్రపంచానికి చాటడమే వారి స్టేటస్.
* దేశ వ్యాప్తంగా పలు రక్తదాతల సమూహాలు ఉన్నాయి. వాటిలో భాగస్వామ్యం ఉన్న సభ్యులు తమ స్టేటస్‌లో రక్తదానం ఆవశ్యకతను తెలియజేయడమేకాక, ఏ గ్రూప్ రక్తం ఆవశ్యకత ఎక్కడ, ఎవరికి ఉందో క్లుప్తంగా తెలియజేస్తారు. అది చూసి కొందరు దాతలు వెంటనే స్పందిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రాణ దాతలవుతున్నారు.
* ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ఘటనలకు అనుగుణంగానూ యూజర్లు స్పందిస్తున్నారు. ఉదాహరణకు ఈ మధ్యనే శ్రీలంక, న్యూజిలాండ్‌లో జరిగిన మారణహోమాలను ఖండిస్తూ ప్రొఫైల్పిక్ను నలుపురంగులో ఉంచుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ మృతులకు నివాళులు అర్పించారు.
* ఈ మధ్యనే కొందరు స్నేహితులు కర్నూలు జిల్లా అహోబిలం మార్గంలో ఆకలి దప్పికలతో అల్లాడుతున్న కోతులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని స్టేటస్ ద్వారా తెలియజేశారు. వీటికి స్పందించి ఎంతో మంది ముందుకు రావడం మంచి పరిణామం.
* తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీసు అధికారులు శిరస్త్రాణం, ఎల్‌హెచ్‌ఎంఎస్, డయల్100 ప్రాముఖ్యతలను తెలియజేసేందుకు అందుకు సంబంధించిన దృశ్యాలను, చిత్రాలను తమ స్టేటసుల్లో ఉంచుతున్నారు. ఇలా వాహనదారుల్లో చైతన్యం నింపడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
* మదర్స్, ఫాదర్స్ డేలకు సంబంధించిన విషయాలను తెలియజేసేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారు. అమ్మలు, నాన్నల మనసును దోచుకొనే కొటేషన్లు, చిత్రాలు, షార్ట్‌ఫిల్మ్‌లను స్టేటసుల్లో ఉంచుతున్నారు.
స్టేటస్ ద్వారా చెబుతుంటా సమాజ హితం మన బాధ్యతగా తీసుకోవాలి. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వృథా చేయకూడదు. పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలను స్టేటస్ ద్వారా తెలియజేస్తుంటా. ముఖ్యంగా శిరస్త్రాణంపై అవగాహన కల్పిచేందుకు స్టేటస్‌ను ఉపయోగిస్తుంటా. దీంతోపాటు ఎల్‌హెచ్‌ఎంఎస్, శక్తి టీం, డయల్ 100 వంటి మా కార్యక్రమాల వివరాలను స్టేటస్ ద్వారా ఇతరులకు తెలియజేస్తుంటా.-ప్రియతమ్‌రెడ్డి, ఎస్సై
|
అవసరాలకు అనుగుణంగా ఈ మధ్యనే నేను అహోబిలం అటవీ ప్రాంతంలో ఆకలిదప్పికలతో కోతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వాటికి సాయం అందించాలని స్టేటస్ ద్వారా తెలియజేశా. చాలామంది స్పందించి నన్ను అనుసరించారు. అందరం కలిసి వెళ్లి వాటి ఆకలిదప్పికలను తీర్చాం.- రవితేజ
|
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
