
తాజా వార్తలు
ఆసక్తికరంగా ‘ఆమె’ టీజర్
చెన్నై: కథానాయిక అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆమె’ సినిమా టీజర్ విడుదలైంది. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. కుమార్తె కనిపించలేదని పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం.. ఇలా ఒక్కో సన్నివేశాన్ని టీజర్లో ఆసక్తికరంగా చూపించారు. ‘మీ ప్రేమ, అభిమానంతో మరో ప్రయాణం మొదలు పెట్టాను. మీ అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాకు కావాలి. త్వరలో ‘ఆమె’ విడుదల కాబోతోంది’ అని అమలాపాల్ పేర్కొన్నారు. రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ టీజర్‌ను చూసిన సినీ ప్రముఖులు అమలపాల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయడానికి నిజంగా ధైర్యం కావాలని ప్రశంసిస్తున్నారు.
టీజర్ అద్భుతంగా ఉంది: సమంత
‘ఆమె’ సినిమా టీజర్ అద్భుతంగా ఉందని కథానాయిక సమంత ట్వీట్ చేశారు. అమలాపాల్‌కు శుభాకాంక్షలు చెప్పారు. సినిమా గురించి తెలుసుకోవాలనే ఆతృత పెరిగిందని అన్నారు. చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
