close

తాజా వార్తలు

రహస్యంగా రెజీనా నిశ్చితార్థం?

హైదరాబాద్‌: ప్రముఖ నటి రెజీనా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ నేషనల్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ రెజీనా నిశ్చితార్థం గురించి వార్తలు ప్రచురించడం వైరల్‌గా మారింది. ఈ నెల 13న చెన్నైలో కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో రెజీనా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని పేర్కొంది. 

ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారని రాసింది. దాంతో ఈ వార్త కాస్తా సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే రెజీనా మాత్రం దీని గురించి ఇప్పటివరకు స్పందించలేదు. ఇటీవల విడుదలైన ‘7’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక ఆమె పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.