close

తాజా వార్తలు

‘ఈ పాట మాత్రం ఫుల్‌ సౌండ్‌లో వినాలా..’

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని లిరికల్‌ టైటిల్‌ పాటను రామ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘ఇగో చెప్తున్నా.. ఈ పాట మాత్రం ఫుల్‌ సౌండ్‌లో వినాలా..’ అంటూ  క్యాప్షన్‌ ఇచ్చారు. ‘చార్మినార్‌, చాదర్‌ఘాట్‌ అంతా నాదే..’ అంటూ హిందీ, తెలుగు మిక్స్‌ చేసున్న లిరిక్స్‌తో సాగుతున్న ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. జులై 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.