close

తాజా వార్తలు

‘బిగ్‌బాస్‌ 3’ ప్రసారానికి స్టే కోరుతూ పిటిషన్‌

 చెన్నై లీగల్‌: నటుడు కమల్‌హాసన్‌ నిర్వహించనున్న బిగ్‌బాస్‌-3 కార్యక్రమ ప్రసారానికి స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 1, సీజన్‌ 2 కార్యక్రమాల వరుసలో బిగ్‌బాస్‌-3 కార్యక్రమం విజయ్‌ టీవీ ఛానెల్‌లో 23వ తేదీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి, దానిని ప్రసారం చేసే టీవీ ఛానెల్‌పై మద్రాసు హైకోర్టులో న్యాయవాది సుదన్‌ బుధవారం ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో... బిగ్‌బాస్‌ కార్యక్రమంలో పాల్గొనే పోటీదారులు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని, ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇది యువతకు పరిపాటియైనా తల్లిదండ్రులకు సంకోచం కలిగిస్తోందని తెలిపారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు ముందుగా సెన్సార్‌ బోర్డు తనిఖీ చేయాలని కోరారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.