
తాజా వార్తలు
హృతిక్ సోదరి సునైనా
ముంబయి: ఓ ముస్లింని ప్రేమించినందుకు తనను ఇంట్లోవారు హింసిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్. ఈ విషయాలన్నీ సునైనా.. హృతిక్‌కు శ్రతువైన నటి కంగనా రనౌత్‌కు చెప్పడంతో ఆమె సోదరి రంగోలీ ట్విటర్ వేదికగా బయటపెట్టారు. తాజాగా సునైనా మీడియా ముందుకు వచ్చి తాను ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించారు.
‘గతేడాది దిల్లీకి చెందిన ఓ ముస్లిం వ్యక్తి పరిచయమయ్యాడు. అతన్ని ఇష్టపడ్డాను. కానీ ఇంట్లో వారు ఒప్పుకోవడంలేదు. నా జీవితాన్ని నరకం చేసేస్తున్నారు. ఉగ్రవాదిని ప్రేమించానంటూ హింసిస్తున్నారు. భరించలేకపోతున్నాను. అతన్ని కలవనివ్వడంలేదు. పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. కానీ నాకు ప్రేమించిన వ్యక్తితో కలిసుండాలని ఉంది. ఆయన ముస్లిం అయినంత మాత్రాన ఒప్పుకోకపోవడం సరికాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సునైనా.
అయితే కంగన ద్వారా ఈ విషయాలన్నీ బయటపెట్టాల్సిన అవసరం ఏంటి? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘ఎందుకంటే కంగన మహిళా సాధికారతకు నిదర్శనం. ఆపదలో ఉన్న మహిళలను వెంటనే ఆదుకోవాలనుకుంటారు. హృతిక్, కంగనల మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ అతని కారణంగా కంగన ఎంతో బాధపడ్డారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. నా విషయంలోనూ ఇదే జరగుతోంది. నేనూ న్యాయం కోసం పోరాడుతున్నా. కంగన, నేను మంచి స్నేహితులం. కానీ రెండేళ్ల క్రితం ఆమె జాతీయ అవార్డు అందుకుందని తెలిసి కంగ్రాట్స్ చెప్పడానికి మెసేజ్ పెట్టాను. కానీ కంగన నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ‘నాకు మెసేజ్ చేయొద్దు. మాట్లాడేందుకు ప్రయత్నించొద్దు’ అన్నారు. అలా ఎందుకు అన్నారో నాకు అర్థంకాలేదు. ఈ పరిస్థితుల్లో నాకు కంగన తప్ప ఎవ్వరూ సాయం చేయలేరు అనిపించింది. అందుకే తనను సంప్రదించాను’ అని వెల్లడించారు.
ఈ వివాదం గురించి హృతిక్ రోషన్ కానీ ఆయన తండ్రి రాకేశ్ రోషన్ కానీ ఏమీ స్పందించలేదు. హృతిక్ మాజీ భార్య సుసాన్నే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయం గురించి స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు సునైనా మంచిది. కాకపోతే ఆమె ప్రస్తుతం బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సునైనా తండ్రి రాకేశ్ రోషన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమె తల్లి ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో తెలీక సతమతమవుతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి కుటుంబంలో జరుగుతుంటాయి. ఈ కుటుంబంతో నేను చాలా కాలం పాటు ఉన్నాను కాబట్టే స్పందిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
