close

తాజా వార్తలు

కేబుల్‌ రైడ్‌ ఎక్కిన ప్రభాస్‌, శ్రద్ధ!

వైరలవుతున్న ఫొటోలు!

ఆస్ట్రియా: సినీ నటులు ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ ‘సాహో’ చిత్రబృందంతో కలిసి కేబుల్‌ రైడ్‌ను ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ‘సాహో’ సినిమా చిత్రీకరణ ఆస్ట్రియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్‌, శ్రద్ధతో ఇతర సిబ్బంది కేబుల్‌ రైడ్‌ ఎక్కారు. చిత్రబృందంతో కలిసి ప్రభాస్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను శ్రద్ధా కపూర్‌ హెయిర్‌ స్టయిలిస్ట్‌ నికితా మేనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.
ఈ షెడ్యూల్‌తో ‘సాహో’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తోంది. సుజీత్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. అద్భుతమైన స్టంట్స్‌, డైలాగ్స్‌, యాక్షన్‌ ఘట్టాలతో టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.