
తాజా వార్తలు
ఫొటోగ్రాఫర్లను ఉద్దేశిస్తూ దీపిక
ముంబయి: సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా చకచకా ఫొటోలు క్లిక్‌మనిపించేస్తుంటారు ఫొటోగ్రాఫర్లు. బాలీవుడ్లో అయితే మరీనూ. ఫలానా చోట ఓ హీరో కానీ హీరోయిన్ కానీ కనిపించారంటే వారిని వెంబడిస్తూ ఫొటోలు తీసేస్తుంటారు. ఈ విషయంలో ఒక్కోసారి సెలబ్రిటీలకు, మీడియాకు చిన్నపాటి తగాదాలు కూడా వస్తుంటాయి.
తాజాగా నటి దీపికా పదుకొణెకు ఫొటోగ్రాఫర్ల నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కారు ఎక్కుతుండగా ఫొటోలు తీయాలన్న ఆత్రుతతో ఫొటోగ్రాఫర్లు ఆమె కారు దాకా వెళ్లిపోయారు. దాంతో దీపిక.. ‘రండి నా కారులోకి వచ్చి కూర్చోండి’ అని చమత్కరించారు. ఆ సమయంలో ముంబయికి చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ దీపిక రియాక్షన్‌ను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీపిక ‘ఛపాక్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ‘83’ సినిమాలో నటిస్తున్నారు. పెళ్లయ్యాక వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది.
View this post on InstagramHer amazing sense of humor ????? #deepikapadukone
A post shared by Viral Bhayani (@viralbhayani) on
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
