
తాజా వార్తలు
మళ్లీ తప్పకుండా వస్తా: గాయకుడు
వాషింగ్టన్: ప్రముఖ పాప్ గాయకుడు ఎన్రికే ఇగ్లేసియాస్కు భారత్‌లోనూ వీరాభిమానులు ఉన్నారు. 44 ఏళ్ల ఈ గాయకుడికి భారత్ అంటే ఎంతో ఇష్టం. 2004లో, 2012లో భారత్‌కు వచ్చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. త్వరలో మరోసారి ఇండియాకు రాబోతున్నట్లు వెల్లడిస్తూ పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఆ సమయంలో ఎన్రికే కారులో వెళుతూ మెక్సికన్ ఛానెల్ రిపోర్టర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అది చూసి అభిమాని ఒకరు ఎన్రికే కారుని ఫాలో అయ్యాడు. అప్పుడు రిపోర్టర్ కారు విండో తీయగా.. ‘మీరు ఎన్రికేనా?’ అని సదరు అభిమాని గాయకుడిని అడిగాడు. ఇందుకు ఆయన అవును అని సమాధానం ఇచ్చారు. దాంతో అతను సంతోషంతో.. ‘మిమ్మల్ని ఇండియాలో చూస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు రాక్‌స్టార్. మిమ్మల్ని ఇక్కడి వారు ఎంతో ప్రేమిస్తారు’ అని చెప్పాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘ప్రపంచంలో నాకు నచ్చిన దేశాల్లో ఇండియా ఒకటి. ఐ లవ్యూ ఇండియా. త్వరలో మళ్లీ భారత్‌కు రావాలనుకుంటున్నాను’ అని క్యాప్షన్ ఇచ్చారు.
View this post on InstagramOne of my favorite places in the world! I love you #India... can’t wait to be back!! 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #TBT
A post shared by Enrique Iglesias (@enriqueiglesias) on