
తాజా వార్తలు
హైదరాబాద్: ‘సూర్య కిరణాలు పడే ప్రతి చోటూ మన రాజ్యమే!. కానీ, ఒక రాజు పరిపాలన సూర్యుడిలా ఉదయించి, అస్తమిస్తుంది. ఒకరోజు నా పాలనలో అస్తమించిన సూర్యుడు.. కొత్త రాజైన నీ పాలనలో ఉదయిస్తాడు’ అంటున్నాడు రవిశంకర్ అలియాస్ ముఫాసా. ప్రఖ్యాత వాల్ డిస్నీ సంస్థ తెరకెక్కిన చిత్రం ‘ది లయన్ కింగ్’. కామిక్ పుస్తకాల నుంచి పుట్టిన సింబా అనే సింహం కథే ఈ చిత్రం. సోమవారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులోని జంతువుల పాత్రలకు మన తెలుగు నటులు గొంతు అరువిచ్చారు. ప్రధాన పాత్ర సింబా అనే సింహానికి నాని, సింబా తండ్రి ముఫాసాకు రవి శంకర్, స్కార్కు జగపతిబాబు గళం అందించగా, టిమోన్ అనే ముంగిస అలీ, పుంబా అనే అడవి పందికి బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. ‘అందరి బతుకులు ఒకేలా ఉండవు కదా! నా చిన్నారి మిత్రమా. పారిపో సింబా. ఇంకెప్పటికీ తిరిగి రాకు’ అంటూ గంభీరమైన గొంతుతో జగపతిబాబు చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. త్రీడీ యానిమేటెడ్ సాంకేతితకతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
