
తాజా వార్తలు
సమంత, నందినీరెడ్డిని ఇంటర్వ్యూ చేసిన గంగవ్వ
హైదరాబాద్: అగ్రకథానాయిక సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని కాస్త విభిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది చిత్రబృందం. ఇందుకోసం సోషల్‌మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వతో కలిసి నందినీరెడ్డి, సమంత ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గంగవ్వ.. సమంతను, నందినీ రెడ్డిని తన ఫన్నీ ప్రశ్నలతో ఎలా ముప్పతిప్పలు పెట్టారో చూడండి.
నందిని మేడమ్.. మీరు ఇలా ప్యాంట్, షర్ట్ వేసుకుంటారు. మీ భర్త ఏమీ అనరా?
నందిని: నాకు తెలివి ఎక్కువ. ఇలా ఉన్నానని నా భర్త ఏమైనా అంటాడేమోనని నేను పెళ్లి చేసుకోలేదు. నాకు చీర కట్టుకుంటే తొందరగా నడవటం రాదు. అందుకే ప్యాంట్, షర్ట్ వేసుకుంటాను.
మీ అత్తగారు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? లేక మీరే మీ అత్తగారిని చూసుకుంటారా?
సమంత: ఇద్దరం ఒకర్నొకరం బాగా చూసుకుంటాం.
ఇంట్లో వంట ఎవరు చేస్తారు?
సమంత: మీ అభిప్రాయంలో అయితే నేనే చేయాలి. కాబట్టి రేపట్నుంచి నేనే వంట చేసి పెడతాను.
మీరు నాగచైతన్యను ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు?
సమంత: చాలా ఇచ్చాను. ఎంత ఇచ్చానో నేను మీ చెవులో చెప్తాను.
నందిని మేడమ్.. మీకు ఎలాంటి భర్త కావాలి?
నందిని: ప్రభాస్ అంత ఎత్తు ఉండాలి. నన్ను ఎత్తుకుని తిరగడానికి నాకంటే లావుండాలి. నన్ను బాగా చూసుకోవడానికి బాగా డబ్బులుండాలి.
‘ఓ బేబీ’ సినిమాలో సమంతనే ఎందుకు తీసుకోవాలని అనిపించింది?
నందిని: ఎందుకంటే సినిమాలో ఆ పాత్ర అన్ని రకాల హావభావాలు, భావోద్వేగాలు పండించగలగాలి. ఇవన్నీ సమంతే చేయగలదు అనిపించింది.
సమంత.. 70 ఏళ్ల బామ్మలా నటించడానికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు?
సమంత: పెద్దవాళ్లు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. వారు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తుంటారు.. ఇలాంటివన్నీ గమనించి నా పాత్ర కోసం సిద్ధమయ్యా.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
