
తాజా వార్తలు
తికమకలోనే ఉన్నా..!
హైదరాబాద్: ‘ఓ బేబీ’ సినిమా తర్వాత ఎలాంటి కథను ఎంచుకోవాలి? అనే తికమకలో ఉన్నానని అగ్ర కథానాయిక సమంత అన్నారు. ఆమె టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సినిమా ‘థ్యాంక్స్ మీట్’ను ఏర్పాటు చేశారు. చిత్ర బృందంతోపాటు హీరో రానా కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘నేను ‘ఓ బేబీ’ సినిమా షూటింగ్లో పాల్గొనన్ని రోజుల కంటే.. చిత్రం ప్రమోషన్లో పాల్గొన్న రోజులే ఎక్కువ (నవ్వుతూ). నా లుక్, దుస్తులు మాత్రమే మారుతూ వచ్చాయి. కానీ మాటలు మాత్రం అవే. యూట్యూబ్, టీవీ.. ఎక్కడ చూసినా నీ ముఖమే కనిపిస్తోందని చాలా మంది అన్నారు. నాకు కూడా అలానే అనిపించింది. కానీ ప్రచారం చేయకపోతే ప్రజలు రారు.. తప్పదు కదా (నవ్వుతూ). సినిమా విడుదల ముందు రోజు రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు. తొలిరోజు నుంచే సినిమాకు పాజిటీవ్ రిప్లైలు వచ్చాయి. ఆ రోజు భావోద్వేగానికి గురయ్యా. మీ అందరికీ ధన్యవాదాలు. ఇది నాకు ఓ గొప్ప బహుమతి’.
‘ఈ సినిమా తర్వాత ఇంకేం చేయాలని నేను నందిని రెడ్డితో అన్నా. ఇక రిటైర్మెంట్ తీసుకోవాలా? (సంతృప్తి చెందిన భావనతో). ‘ఓ బేబీ’ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే తికమకలోనే ఉన్నాను. నాకు తెలుసు.. ఇలా కేవలం మరో రెండు రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇంకా ఉత్తమమైన స్క్రిప్టు, నటన అని ఆలోచిస్తా. నాకు కొంచెం పిచ్చే (నవ్వుతూ). ఏదేమైనా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. నా మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఫాలోవర్స్ చేసే ప్రతి ట్వీట్ చదువుతున్నా. కానీ అందరికీ రిప్లై ఇవ్వలేను. ప్రతి ట్వీట్ నా హృదయాన్ని తాకుతోంది’ అని చెప్పారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రానా... ‘ఓ బేబి’ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు కూడా కొరియన్ సినిమా కథలు వినిపించాలని ‘ఓ బేబి’ చిత్ర బృందానికి విజ్ఞప్తి చేసి చమత్కరించారు. కాగా ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి చైనాలోనూ విడుదల చేయాలని అక్కడి నిర్మాతలు కోరుతున్నట్లు నిర్మాత సునిత తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
