
తాజా వార్తలు
హైదరాబాద్: ‘ఓ బేబీ’ సినిమా తనకు చాలా నచ్చిందని అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన కోడలు సమంత టైటిల్ రోల్ పోషించిన చిత్రమిది. నందిని రెడ్డి దర్శకురాలు. నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. సినీ విమర్శకులు సైతం సామ్‌ను ప్రశంసించారు.
కాగా ఈ చిత్రాన్ని తాజాగా చూసిన నాగార్జున ట్విటర్ వేదికగా తన అభిప్రాయం తెలిపారు. ‘‘ఓ బేబీ’ చాలా నచ్చింది. లక్ష్మి గారు, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్.. ప్రతి ఒక్కరు చక్కగా నటించారు. ప్రియమైన సమంత నువ్వు నమ్మశక్యం కాని ఓ అద్భుతం. నందిని రెడ్డికి హ్యాట్సాఫ్’ అని నాగ్ పోస్ట్ చేశారు. దీనికి సామ్ ప్రతిస్పందించారు. ‘సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నా.. మీరు నా కోసం చేసిన ప్రతి పనికి ధన్యవాదాలు. విడుదల రోజున పరిస్థితి తెలుసుకోవడానికి గంట గంటకూ ఫోన్ చేసినందుకు కూడా థాంక్స్. మీరు నిజంగా ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
