
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ డిస్నీ నిర్మించిన లైవ్ యానిమేషన్ చిత్రం ‘ది లయన్ కింగ్’. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ముందుగానే చైనాలో విడుదలైంది. అంతేకాదు, డిస్నీ గత చిత్రాలైన ‘జంగిల్‌బుక్’(11.6 మిలియన్ డాలర్లు), ‘బ్యూటీ అండ్ ద బీస్ట్’(12.4 మిలియన్ డాలర్లు) చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. చైనాలో తొలి రోజే ఈ చిత్రం 14.5మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక అమెరికాతో పాటు, భారత్‌లోనూ ఈనెల 19న ‘ది లయన్ కింగ్’ విడుదల కానుంది. ఇందులోని పాత్రలకు తెలుగులో నాని, రవిశంకర్, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం, లిప్సిక డబ్బింగ్ చెప్పారు. దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో సిద్ధార్థ్, అరవిందస్వామిలు డబ్బింగ్ చెప్పగా, హిందీలో షారుఖ్‌ఖాన్, ఆయన తనయుడు ఆర్యన్, ఆశిష్ విద్యార్థి తదితరులు డబ్బింగ్ చెప్పడం విశేషం.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- కిల్లర్ శ్రీనివాస్‌నూ చంపేయండి!
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఘటనా స్థలికి రానున్న ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
