close

తాజా వార్తలు

చంద్రయాన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం

శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక  నుంచి చంద్రయాన్‌-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ ఆదివారం ఉదయం 6.51 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 20 గంటలపాటు కొనసాగిన తర్వాత సోమవారం వేకువజామున 2.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ- మార్క్‌ 3 ఎం1 వాహక నౌక ద్వారా చంద్రయాన్‌ -2ని రోదసీలోకి పంపనున్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగ వీక్షణకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ దంపతులు, గవర్నర్‌ నృసింహన్‌ దంపతులు‌ శ్రీహరికోటకు ఈ రోజు చేరుకోనున్నారు. 

చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో రోవర్‌, ల్యాండర్‌, ఆర్బిటర్‌ అనుసంధానం చేశారు. దీని బరువు 3,447 కిలోలు. ఇందులో ప్రొపెల్లర్‌ బరువు 1179 కిలోలు. ప్రయోగం జరిగిన అయిదు రోజుల తరువాత భూ నియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహం ప్రవేశిస్తోంది. అక్కడ నుంచి 3.5 లక్షల కిలోమీటర్ల దూరం చంద్రుని వైపు పయనించనుంది. సెప్టెంబరు 6,7 తేదీల్లో చంద్రునిపై ల్యాండర్‌ కాలుమోపే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.