close

తాజా వార్తలు

ఈ కథానాయికను గుర్తు పట్టగలరా?

హైదరాబాద్‌: ఈ ఫొటోలోని కథానాయికను గుర్తుపట్టారా?.. ఎత్తుపళ్లు, చేతిలో పిజ్జాతో కాస్త విచిత్రంగా ఉన్న ఈమె ఎవరో కాదండీ. ‘హార్ట్‌ ఎటాక్‌’ చిత్రంతో కుర్రకారు మనసులు దోచిన నటి అదా శర్మ. ఈ భామ ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..’ అని ట్వీట్‌ చేశారు. అయితే అక్కడ ఉన్నది ఆమేనని అభిమానులు గుర్తు పట్టేశారు. ‘నువ్వు ఎంత మేకప్‌ వేసినా మేం గుర్తు పట్టగలం, నువ్వే..’ అంటూ కామెంట్లు చేశారు. మరి అదా ఈ లుక్‌లో ఎందుకు తయారయ్యారో చెప్పలేదు.

‘క్షణం’ తర్వాత అదా తెలుగులో ‘కల్కి’ చిత్రంలో నటించారు. రాజశేఖర్‌ కథానాయకుడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకుడు.  అదా ‘కమాండో 3’, ‘బైపాస్‌ రోడ్‌’ అనే హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. దీంతోపాటు వెబ్‌ సిరీస్‌లోనూ సందడి చేస్తున్నారు. మొదటిసారి ‘ది హాలిడే’ అనే సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ఇటీవల విడుదలైంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.