close

తాజా వార్తలు

అది నా ఓటరు కార్డు కాదు: మనోజ్‌

హైదరాబాద్‌: తన ఓటరు కార్డుపై తప్పుడు వార్తలు వస్తున్నాయని కథానాయకుడు మంచు మనోజ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మున్సిపాలిటీలోని చిరునామాతో మంచు మనోజ్‌కు ఓటరు గుర్తుంపు కార్డు ఉందని ఓ మీడియా సంస్థ వార్తను ప్రసారం చేసింది. మనోజ్‌ ఓటరు కార్డు ఫొటోను చూపిస్తూ.. కథనం ప్రసారం చేసింది. దీనిపై మనోజ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. అది తప్పుడు ఓటరు కార్డని చెప్పారు. ‘ఇవాళ నా ఓటరు కార్డుపై వచ్చిన ఓ వార్త వీడియో చూశా. నా కార్డులో ఫిల్మ్‌నగర్‌లోని నా ఇంటి చిరునామా ఉంది. ఈ వార్తలో నిజం లేదు. ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని ఆయన ట్వీట్‌ చేశారు. . కొన్ని రోజుల క్రితం ఆయన ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. సమాజసేవలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.