close

తాజా వార్తలు

ఆద్య.. సితార ఛాలెంజ్‌ చూశారా?

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు కుమార్తె సితార సొంతంగా యూట్యూబ్‌లో ఓ ఛానల్ ప్రారంభించింది. తన స్నేహితురాలితో కలిసి A&S అనే పేరుతో ఛానల్‌ను ప్రారంభించింది. ఇందులో ‘A’ అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె. ‘S’ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో A&S యూట్యూబ్ ఛానల్ ఆరంభించారు. మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ ఛాలెంజ్’ పేరుతో ఓ వీడియోను తాజా పోస్ట్ చేశారు.

చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. యూట్యూబ్‌లో ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ గుడ్ ఫ్రెండ్స్ కోసం మహేశ్‌బాబు కూడా రంగంలోకి దిగారు. సితార, ఆద్య రూపొందించిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసి చిన్నారులకు శుభాకాంక్షలు చెప్పారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.