close

తాజా వార్తలు

మలేషియాలో ‘మిస్టర్‌ కేకే’పై నిషేధం

నిరాశకు గురైన అభిమానులు

చెన్నై: తమిళ స్టార్‌ విక్రమ్‌ నటించిన సినిమా ‘మిస్టర్‌ కేకే’. కోలీవుడ్‌లో ఈ సినిమాను ‘కడరం కొండాన్’ టైటిల్‌తో విడుదల చేశారు. రాజేష్‌ ఎమ్‌ సెల్వ దర్శకుడు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్‌, నాజర్‌ కుమారుడు అబీ హస్సన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న విడుదలైన సినిమా మంచి టాక్‌ అందుకుంది.

కాగా భారత్‌లో ఈ సినిమా విజయవంతంగా ఆడుతోంది. అయితే మలేషియాలో ఈ చిత్రాన్ని నిషేధించారు. సినిమాలో మలేషియా పోలీసులు, సమాజాన్ని తప్పుగా చూపించారని అక్కడి సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మలేషియాలోని విక్రమ్‌ అభిమానులు నిరాశ చెందారు. కొందరు ఫ్యాన్స్‌ సింగపూర్‌కు వెళ్లి ‘మిస్టర్‌ కేకే’ సినిమా చూస్తున్నారట. ఈ నేపథ్యంలో మలేషియాలో ‘మిస్టర్‌ కేకే’ పంపిణీదారుల సంఘం లోటస్‌ ఫైవ్‌ స్టార్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. సినిమాను మలేషియాలో విడుదల చేయలేకపోతున్నందుకు క్షమాపణలు కోరింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.