close

తాజా వార్తలు

ఆ చిన్నారికి నేను ఫ్రెండ్‌ని: హృతిక్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌కు ఓ బుజ్జి స్నేహితురాలు దొరికిందట. శనివారం హృతిక్‌ ఓ జిమ్‌కి వెళ్లగా అక్కడ అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. ఆ గుంపులో నుంచి ఓ చిన్నారి హృతిక్‌కు ఓ బ్యాండ్‌ను కానుకగా ఇచ్చింది. ఆ చిన్నారిని అక్కడే ఉన్నవారు ఎత్తుకుని హృతిక్‌కు చూపించారు. ఆ సందర్భంలో తీసిన వీడియోను హృతిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. ‘జిమ్‌లో ఓ చిన్నారి నన్ను తన స్నేహితుడిగా అంగీకరించింది. ఈ వీడియోను ఆ చిన్నారి చూస్తుందని ఆశిస్తున్నా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల విడుదలైన ‘సూపర్‌30’ చిత్రంతో హృతిక్‌ మంచి సక్సెస్‌ను అందుకున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.