close

తాజా వార్తలు

పూరీ, ఛార్మితో రామ్‌కు గొడవ?

క్లారిటీ ఇచ్చిన హీరో

హైదరాబాద్‌: దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి, నిర్మాత ఛార్మితో కథానాయకుడు రామ్‌కు గొడవైందని, వాళ్ల మధ్య పరిస్థితులు బాగోలేవని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్‌ విదేశాలకు వెళ్లారని కూడా రాసుకొచ్చారు. అంతేకాదు రామ్‌కు కేవలం సగం పారితోషికం మాత్రమే ఇచ్చారని.. మణిశర్మ, మిగిలిన చిత్ర బృందానికి కూడా ప్రామిస్‌ చేసినంత పారితోషికం ఇవ్వలేదని వదంతులు వచ్చాయి.

 ఈ మేరకు ఓ మీడియా సంస్థ రాసిన వార్తను రామ్‌ చూశారు. ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ‘ఈ వార్త చూసి పడిపడి నవ్వుకున్నా. ఇలాంటి తప్పుడు వార్తలకు సాధారణంగా నేను స్పందించను. కానీ, ఈ వదంతు మాత్రం సూపర్‌. ‘బంగారం అండీ వీళ్లు..’’ అంటూ పూరీ, ఛార్మిని ట్యాగ్‌ చేశారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా కోసం రామ్‌, పూరీ, ఛార్మి కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలు. మణిశర్మ బాణీలు అందించారు. ఈ నెల 18న విడుదలైన సినిమా విజయం సాధించింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లో రూ.48 కోట్లు రాబట్టినట్లు నిర్మాతలు పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.