
తాజా వార్తలు
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంపై ట్వీట్లు
హైదరాబాద్: చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్ 7న చందమామపై దిగనుంది. ఇస్రో ఈ ఖ్యాతి సాధించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సగటు భారతీయుడు గర్వించాల్సిన తరుణమని పేర్కొన్నారు. నాగార్జున, ప్రభాస్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ తదితరులు ట్వీట్లు చేసిన వారిలో ఉన్నారు.
* ఎస్.ఎస్. రాజమౌళి: ఇస్రో చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించినందుకు శుభాకాంక్షలు.. జై హింద్.
* నాగార్జున: భారత్ మరో ఘనత సాధించింది. చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు.
* ప్రభాస్: చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారతీయులుగా మనం ఎంతో గర్వపడాలి. ఎన్నో సవాళ్లు, సాంకేతిక ఇబ్బందులను అధిగమించి 300 టన్నుల బరువుతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని ‘బాహుబలి’తో పోల్చడాన్ని మా ‘బాహుబలి’ చిత్ర బృందం గౌరవంగా భావిస్తోంది. మోర్ పవర్ టు ఇండియా.
* తాప్సి: ఇది గర్వించాల్సిన సమయం.
* మంచు విష్ణు: విజయవంతంగా చంద్రయాన్-2ను ప్రయోగించిన ఇస్రోకు శుభాకాంక్షలు. ఈ ప్రయోగం నన్ను ఎంతో ఉత్కంఠకు గురి చేసింది.
* రామజోగయ్య శాస్త్రి: ఆత్మస్థైర్యం దేన్నైనా సాధ్యం చేస్తుంది. హృదయపూర్వక శుభాకాంక్షలు.
* యామీ గౌతమ్: ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సమయం ఇది. ఇస్రో బృందానికి శుభాకాంక్షలు.
* రకుల్‌ప్రీత్ సింగ్: చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రోకు ఆల్ ది బెస్ట్.
* మాధవన్: చాలా చాలా గర్వంగా ఉంది ఇస్రో. ఇది అద్భుతమైన ప్రారంభం. చాలా సంతోషంగా ఉంది.
* ఖుష్బూ: జైహింద్.
* అక్షయ్ కుమార్: ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రయాన్-2 విజయం వెనుక ఉన్న బృందానికి సెల్యూట్.
* కరణ్ జోహార్: చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించే అవకాశం వచ్చినందుకు మనం నిజంగా అదృష్టవంతులం. ఇద్దరు మహిళల సారధ్యంలో ఇస్రో నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇది. మహిళలు ప్రపంచాన్ని ఏలుతున్నారు.. శుభాకాంక్షలు ఇస్రో.
* షారుక్ ఖాన్: చంద్రయాన్-2 ప్రయోగం చాలా శ్రమతో కూడుకున్నది. నమ్మకంతో దాన్ని విజయవంతం చేసినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- ఫ్యాన్ మృతిపట్ల చెర్రీ ఆవేదన..వీడియో వైరల్
- రేషన్ జాబితా నుంచి వారిని తొలగించొద్దు
- నాగేశ్వరరావు న్యాయం చేయలేడన్నారు!
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- వాహనాల విక్రయాలు.. మళ్లీ తగ్గాయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
