close

తాజా వార్తలు

బాలీవుడ్ బంపర్‌ వి‘చిత్రాలు’

సినిమాల్లోని చిన్నచిన్న పొరపాట్లు

పొరపాటు మానవ సహజం... దానికి సినిమావాళ్లు అతీతులా ఏంటి? పదుల సంఖ్యలో సినిమాలు తీసే దర్శకులు అయినా, ఎడిటర్లయినా ఎక్కడో ఒకసారి రీల్‌లో కాలేస్తారు.. దట్‌ మీన్‌ పప్పులో కాలేస్తారు. అలా బాలీవుడ్‌ చిత్రాలకు సంబంధించి కొన్ని పొరపాట్లను సరదాగా ఒక సారి చూద్దామా..!

దిల్‌వాలే దుల్హానియా.. ఆ స్టేషన్‌ అక్కడ లేదయా

షారుఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగె’. ప్రేమకథాగా వచ్చిన ఈ సినిమా  అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా అంతా పంజాబ్‌ నేపథ్యంగా సాగింది. అయితే ఇక్కడే చిన్న పొరపాటు జరిగిపోయింది. మూవీ క్లైమాక్స్‌ సీన్‌లో చూపించిన రైల్వేస్టేషన్‌ అప్తా అనేది అసలు పంజాబ్‌లోనే లేదు. అది ఎక్కడ ఉందో తెలుసా.. మహారాష్ట్రలో. 

 

‘పీకే’ అది బ్రూగ్స్‌ కాదు.. బ్రస్సెల్స్‌

ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘పీకే’ ఎంతో సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. అనుష్క శర్మ, సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ కీలక పాత్రలు పోషించారు. పీకే (ఆమిర్‌) బ్రూగ్స్‌లో పాకిస్థాన్‌ రాయబారిగా పనిచేస్తుంటాడని ఓ సందర్భంలో అనుష్కతో సుషాంత్‌ చెప్తాడు. అయితే ఇక్కడే దర్శకుడు పప్పులో కాలేశాడు. బ్రూగ్స్‌లో పాకిస్థాన్‌ ఎంబీసీనే లేదు. అది బ్రస్సెల్స్‌ అయి ఉండొచ్చు..

 

రా..వన్‌.. అదెలా మ్యాన్‌!

షారుఖ్‌‌‌ ఖాన్‌, కరీనా కపూర్‌ కలిసి నటించిన చిత్రం రా..వన్‌. ఇందులో షారుఖ్‌ దక్షిణ భారత దేశానికి చెందిన హిందువుగా కనిపిస్తాడు. అయితే తను చనిపోయిన తర్వాత క్రిస్టియన్‌ పద్ధతిలో ఖననం చేయడం చూస్తాం. తరువాతి సీన్‌లో షారుఖ్‌ ఖాన్‌ భార్య పాత్రధారి అయిన కరీనా కపూర్‌ మాత్రం భస్మాన్ని నీటిలో కలుపుతూ ఉంటుంది. ఇక్కడే ఓ సందేహం వస్తుంది కదూ.. దహన సంస్కారాలు నిర్వహించకుండా భస్మం ఎలా వచ్చిందా అని...!

 

లగాన్‌.. ఓవర్‌కు ఆరు కాదు ఐదే!

ఆంగ్లేయులకు, భారతీయులకు మధ్య క్రికెట్‌ ఆటకు సంబంధించిన ఇతివృత్తంతో వచ్చిన సినిమా ‘లగాన్‌’. ఆమిర్‌ ఖాన్‌ పల్లెటూరి యువకుడిగా నటించారు. అయితే ఇదంతా 1892వ సంవత్సరానికి చెందినదిగా దర్శకుడు కథలో పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓవర్‌కు ఆరు బంతులు ఉన్నట్లు చూపించారు. ఓవర్‌కు ఆరు బంతులు వచ్చిన ఫార్మాట్‌ 1982వ సంవత్సరం నుంచి మాత్రమే  వచ్చింది. 

 

అమర్‌.. అక్బర్‌.. ఆంటోని ముగ్గురూ ఒకేసారి

70వ దశకంలో అమితాబ్‌ బచ్చన్‌, రిషి కపూర్‌, వినోద్‌ ఖన్నా తారాగణంతో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ అమర్‌ అక్బర్‌ ఆంటోని. సినిమా ఎంత సూపర్‌హిట్టో తెలిసిందే. అయితే ఓ సీన్‌లో సైంటిఫిక్‌ పద్ధతిని మిస్‌ అయింది. వారి ముగ్గురికి తల్లిగా నటించిన నిరుప రాయ్‌కు ఒకేసారి రక్తదానం చేయడం గమనార్హం. 

 

ధూమ్‌ ‘2’ తప్పులు

‘ధూమ్‌ 2’ చూసిన వారందరికీ ఓ సీన్‌ గుర్తుండే ఉంటుంది. అదేంటంటే హృతిక్‌ రోషన్‌ ఎయిర్‌పోర్టులో వేచి చూస్తుండగా టీవీలో ఓ న్యూస్‌ వస్తుంది. తర్వాతి దొంగతనం ఎక్కడ చేయబోతున్నాడో దొంగ చెప్పాడని న్యూస్‌ రీడర్‌ వార్త చదువుతుంది. ఇక్కడే రెండు తప్పులు దొర్లాయి. ఎడమ ఫొటో కిందవైపు సెన్సెక్స్‌ కనిపిస్తుంది. అయితే మార్కెట్లు ఎప్పుడూ ఇంత (30శాతం) లాభపడిన దాఖలాలు లేవు. అదేవిధంగా కుడి ఫొటో కిందివైపు నిఫ్టీ(27శాతం) నష్టపోయినట్లు చూపిస్తారు. నిఫ్టీ కూడా ఇప్పటివరకు కేవలం 17.34 శాతం మాత్రమే నష్టపోయాయి.

 

అందాజ్‌ అప్నా అప్నా.. తలకట్టు వేరప్పా

ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘అందాజ్‌ అప్నా అప్నా’. ఈ సినిమా తీయడానికి మూడేళ్ల సమయం పట్టింది. దీంతో ఒక సీన్‌లో కనిపించిన తలకట్టు మరొక సీన్‌లో లేదు. ప్రారంభంలో చిన్న హెయిర్‌స్టైల్‌తో ఉన్న హీరోలు.. కొన్ని సీన్లలో పొడవాటి జుట్టుతో ఉన్నారు. 

ఇవి కొన్ని సినిమాలు మాత్రమే... పట్టి చూస్తే చూసే ప్రతి సినిమాలోనూ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. 

ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.