close

తాజా వార్తలు

ఎవరతను.. పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రియుడా?

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రేమలో పడ్డారా?పై ఫొటోలో ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆమె ప్రియుడా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో చూసి నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవి. సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఫొటోకు మూడు ప్రేమ గుర్తులను జత చేశారు. దాంతో నెటిజన్లు ఆమె ప్రియుడై ఉంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అదీకాకుండా కామెంట్స్‌ ఎక్కువగా కనిపించకుండా పాయల్‌ కొన్ని బ్లాక్‌ చేసేశారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు సౌరభ్. పలు పంజాబీ ధారావాహికల్లో వీరిద్దరూ కలిసి నటించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఒకర్నొకరు ఇష్టపడినట్లు సమాచారం. మరి ఈ విషయంపై పాయల్‌ స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ప్రస్తుతం ఆమె ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఆర్‌డీఎక్స్‌’, రవితేజకు జోడీగా ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.