close

తాజా వార్తలు

‘డియర్‌ కామ్రేడ్‌’ రీమేక్‌ తీస్తా: కరణ్‌ జోహార్‌

‘విజయ్‌ దేవరకొండ బ్రిలియంట్‌’

ముంబయి: బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా ఇది. భరత్‌ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. జులై 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.

కాగా ‘డియర్‌ కామ్రేడ్‌’ హిందీ రీమేక్‌ హక్కుల్ని కరణ్‌ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమాను చూసిన ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది అద్భుతమైన, పవర్‌ఫుల్‌ ప్రేమకథ. భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ చక్కటి సంగీతం అందించారు. నటీనటుల నటన అత్యుత్తమంగా ఉంది. విజయ్‌ దేవరకొండ బ్రిలియంట్‌, రష్మిక బాగా నటించారు. ఈ అందమైన ప్రేమకథను ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థ రీమేక్‌ చేయబోతోంది’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.