
తాజా వార్తలు
‘జాక్‌పాట్’ ఆడియో విడుదల కార్యక్రమంలో..
హైదరాబాద్: తన సతీమణి జ్యోతిక నటించిన ‘జాక్‌పాట్’ సినిమా కథ బాగా నచ్చిందని తమిళ స్టార్ సూర్య అన్నారు. ఆయన నిర్మించిన సినిమా ఇది. కల్యాణ్ దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ బాణీలు అందించారు. శనివారం ఈ సినిమా తెలుగు ఆడియోను విడుదల చేశారు. సూర్య, జ్యోతికతోపాటు చిత్ర బృందం హాజరైంది.
ఈ సందర్భంగా నిర్మాత సూర్య మాట్లాడుతూ.. ‘‘జాక్‌పాట్’ నాకు, జ్యోతికకు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే.. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాను వేరే నిర్మాతలు ఎవరు తీసినా సరిగ్గా రాదేమో అనే భయంతో.. నేనే నా బ్యానర్‌పై నిర్మించాను. మా బ్యానర్‌కి ఈ సినిమాతో మరో హిట్ రాబోతోందని నమ్ముతున్నా. అలానే ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ జ్యోతిక, రేవతిని చూస్తుంటే.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్‌లో నటించారా? అనిపిస్తుంది. మా జ్యోతిక, రేవతి గారు యాక్షన్‌తోపాటు కామెడీని కూడా అద్భుతంగా పండించారు. నా సినిమాలని ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న తెలుగు అభిమానులు.. ‘జాక్‌పాట్’ని హిట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు.
అనంతరం జ్యోతిక మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత మా సొంత బ్యానర్లో సినిమా చేశాను. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం చాలా స్టంట్స్ చేయాల్సి వచ్చింది. ముందు కాస్త భయపడ్డా. కానీ మా ఇంట్లోనే ఓ యాక్షన్ హీరో ఉండటం, ఆయనే నన్ను ప్రోత్సహించడం వల్ల నటించగలిగా. ముఖ్యంగా ఈ సినిమాలో రేవతి గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
