close

తాజా వార్తలు

‘బిగ్‌బాస్‌3’ నాగ్‌ మాయ చేశాడా?

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’. ఇటీవల ప్రారంభమైన ఈ షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. వ్యాఖ్యాతగా నాగార్జున తనదైన టైమింగ్‌, పంచ్‌ డైలాగ్‌లతో వారాంతంలో మెప్పిస్తున్నారు. కాగా, తొలి వారం అత్యధికమంది ఈ షోను చూడటానికి ఆసక్తి చూపినట్లు ‘స్టార్‌ మా’ తెలిపింది. ఇందుకు సంబంధించిన రేటింగ్స్‌ వివరాలను నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. సుమారు 4.5 కోట్లమంది ప్రేక్షకులు బిగ్‌బాస్‌కు చూసేందుకు మొగ్గు చూపారట. మొదటివారం టీవీ వీక్షకుల్లో దాదాపు 60శాతం మంది బిగ్‌బాస్‌3ని వీక్షించారట. #bigbosstelugu3 ఇండియా ట్రెండింగ్స్‌లో టాప్‌లో ఉండగా, మిలియన్‌కు పైగా ఎంగేజ్‌మెంట్లు వచ్చాయట. ఈ సందర్భంగా నాగార్జున ‘బిగ్‌బాస్‌3’ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలివారం నటి హేమ ఎలిమినేట్‌ కాగా, ఆ వెంటనే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.