close

తాజా వార్తలు

ఏ చోట నువ్వున్నా.. ఊపిరిలా నేనుంటా..!

‘సాహో’ రొమాంటిక్‌ సాంగ్‌ పూర్తి వీడియో

హైదరాబాద్‌: ‘ఏ చోట నువ్వున్నా.. ఊపిరిలా నేనుంటా..’ అంటూ శద్ధా కపూర్‌తో డ్యుయెట్‌ వేసుకున్నారు కథానాయకుడు ప్రభాస్‌. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని రెండో గీతం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. కాగా శుక్రవారం ఈ పాట పూర్తి వీడియోను చిత్ర బృందం పంచుకుంది. ఈ పాటలో శ్రద్ధా చాలా అందంగా కనిపించారు. ప్రభాస్‌ హ్యాడ్సమ్‌గా ఉన్నారు. ఈ పాటను తులసీ కుమార్‌, హరిచరణ్‌ శేషాద్రి ఆలపించారు. గురు రాంధ్వా బాణీలు అందించారు.

ఆగస్టు 30న ‘సాహో’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. యాక్షన్‌ కథాంశంతో రూపొందిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముకేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.