close

తాజా వార్తలు

స్నేహమే జీవితం.. ‘చిచోరే’ ట్రైలర్‌ చూశారా

ముంబయి: బాలీవుడ్‌ నటులు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, శ్రద్ధా కపూర్‌, వరుణ్‌ శర్మ, నవీన్‌ పోలిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘చిచోరే’. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సుశాంత్‌, శ్రద్ధ, వరుణ్‌.. తదితర నటీనటుల కాలేజీ, హాస్టల్‌ రోజుల్ని అందంగా చూపించారు. వారి మధ్య ఏర్పడ్డ స్నేహం జీవితాంతం ఎలా ఉందనే విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. వినోదానికి కూడా ఈ చిత్రంలో పెద్ద పీట వేశారు. స్నేహమే జీవితం, ఇది మామూలు స్నేహం కాదు.. ఇడియట్స్‌ స్నేహం.. అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘స్నేహితులతో కలిసి నవ్వుతాం, ఏడుస్తాం.. జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాం’ అంటూ స్నేహం చుట్టూ ఈ ట్రైలర్‌ సాగింది. జీవితంలో స్థిరపడ్డ తర్వాత ఓ ప్రమాదం వల్ల వీరంతా కలుసుకుంటారు. ఇలా ఆసక్తికరంగా ప్రచార చిత్రాన్ని చూపించారు.

నితీష్‌ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాజిద్‌ నడియాడ్వాలా నిర్మించారు. సెప్టెంబరు 6న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ బాగుందని అక్షయ్‌ కుమార్‌, ఆమిర్‌ ఖాన్‌, ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌ తదితరులు ట్వీట్లు చేశారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.