close

తాజా వార్తలు

‘సాహో’ పోస్టర్‌పై హీరో కామెంట్‌

ముంబయి: యంగ్‌ రెబెల్‌స్టార్ ప్రభాస్‌, బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పోస్టర్‌పై బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ సరదాగా కామెంట్‌ చేశారు. ఈ సినిమాలో తనకు సంబంధించిన స్టిల్స్‌ను శ్రద్ధ ఒకొక్కటి సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘సాహో’ సినిమాలోని తొలి పాటకు సంబంధించిన ఓ స్టిల్‌ను శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 
ఎరుపు రంగు గౌనులో, మంచు కొండల్లో, కాళ్ల దగ్గర పొగలు వస్తున్నట్లుగా ఆ ఫొటోను తీశారు. అయితే ఈ ఫొటోను చూసిన అర్జున్.. ‘ఆ రియాక్షన్‌ ఏంటి.. గట్టిగా తుమ్మినట్లు..’ అని చమత్కరించారు. ఈ కామెంట్‌కు దాదాపు రెండు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సాహో’ సినిమా 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను 10న విడుదల చేయనున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.