
తాజా వార్తలు
హైదరాబాద్: ‘డార్లింగ్’ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇది. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు సుజీత్ పూర్తి యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు.
ఇందులో ప్రభాస్.. అశోక చక్రవర్తి అనే అండర్ కవర్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రూ.2వేల కోట్ల దోపిడికీ సంబంధించిన కేసును ఛేదించేందుకు పోలీసులు ఆయన్ను రంగంలోకి దింపే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. శ్రద్ధాకపూర్.. అమృతనాయర్ అనే క్రైం బాంచ్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆ దోపిడీ కేసును ఎలా ఛేదించారు? అందులో ఎవరెవరి హస్తం ఉంది? ఈ కేసును ఛేదించే క్రమంలో అశోక్ చక్రవర్తి, అమృతనాయర్లకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలియాలంటే ఆగస్టు 30 వరకూ వేచి చూడాల్సిందే. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపిస్తోంది.
నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తనీష్ బాగ్చి, జిబ్రాన్(నేపథ్య) సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
